డైరెక్టర్ మారుతి మార్క్ ‘బ్రాండ్ బాబు’

PremaLekhalu

ప్రముఖ డైరెక్టర్ మారుతి ‘బ్రాండ్ బాబు’ అనే సినిమా కోసం మరోసారి రైటర్ గా మారారు. నెక్స్ట్ నువ్వేతో డైరెక్టర్ గా మారిన ఈటీవీ ప్రభాకర్ ఈసారి ‘బ్రాండ్ బాబు’ సినిమాతో తన లక్ పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని శైలేంద్ర బాబు నిర్మించారు. ఇకపోతే ఈ సినిమా టీజర్ ని నిన్న రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

టీజర్ ఆధ్యంతం మారుతి మార్క్ కామెడీ పుష్కలంగా ఉంది. హీరో సుమంత్ శైలేంద్ర తన నటన తో ఆకట్టుకునేలా కనిపిస్తున్నాడు. అలాగే హీరోయిన్ గా నటించిన ఇషా రెబ్బ కూడా మంచి పెర్ఫార్మన్స్ రోల్ చేస్తున్నట్లుంది. మొత్తంగా చూస్తే ఈ చిత్ర టీజర్ బాగానే ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu