గోపీచంద్ సరసన కాజల్..?

PremaLekhalu

పంతం సినిమాతో ఎట్టకేలకు మంచి విజయాన్ని అందుకున్నాడు హీరో గోపీచంద్. ఆయన ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్ కుమార్ సాయి డైరెక్షన్ లో ఒక చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించనుందని సమాచారం. ఇంకా దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

వాస్తవానికి గోపీచంద్ తో కాజల్ ‘మొగుడు’ అనే చిత్రంలో నటించాల్సి ఉంది. ఈ చిత్ర దర్శకుడు కృష్ణ వంశీ గోపిచంద్ కు జోడిగా కాజల్ ను తీసుకోవాలనుకున్నారట. కానీ అప్పుడు ఆమె డేట్స్ దొరకకపోవడంతో ఆ స్థానంలో తాప్సీ ని తీసుకున్నారు. ఇప్పటికి ఈ సినిమా ద్వారా వీరిద్దరూ కలిసి పని చేయనున్నారు.


PremaLekhalu