‘గురు’ డైరెక్టర్ తో సూర్య చిత్రం..!

SriRamaNavami

తమిళ హీరో సూర్య ప్రస్తుతం వరస పెట్టి సినిమాలకు సైన్ చేస్తున్నాడు. ఆయన సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో చేస్తున్న ‘ఎన్ జి కె’ అనే సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇది ఇలా ఉంటే ఆయన కె.వి.ఆనంద్ డైరెక్షన్ లో నటిచబోయే సినిమా షూటింగ్ లండన్ లో ఈమధ్యనే మొదలు పెట్టారు.

తాజాగా ఆయన గురు డైరెక్టర్ సుధా కొంగర డైరెక్షన్ లో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఆగష్టు మధ్య వారంలో మొదలు పెడతారట. ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సూర్య తన సొంత బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.


PremaLekhalu