కౌగిలింత, కన్నుకొట్టుడు వెనక అసలు రహస్యం?

F2 Movie

రాహుల్‍ ఈరోజు మోదీని కౌగలించుకుని సంచలనం సృష్టించాడు. కౌగిలింత మాత్రమే కాదు, కన్ను కూడా కొట్టి ఇంకో చిన్న సైజు సంచలనం సృష్టించాడు. ఇంతకీ రాహుల్‍ ది మెచ్యూరిటీయా? అమెచ్యూరిటీయా? అని అందరికీ డౌట్‌ మొదలయిందిప్పుడు. పార్లమెంట్‌లో తన స్థానం విడిచిపెట్టి రాహుల్‍ మోదీ వైపు వెళ్తుంటే బీజేపీవాళ్లంతా కలవరపడ్డారు. ఇదేంటబ్బా ఏం చేయబోతున్నాడు? అని వర్రీ అయ్యారు. తన వైపు రాహుల్‍ దూసుకొస్తుండడాన్ని చూసి మోదీ కూడా కొంత కలవరానికి లోనైనట్టు కనిపించింది. అయితే మోదీని కౌగలించకుని రాహల్‍ సంచలనం సృష్టించారు.

కౌగలించుకుని వెంటనే లేచి హడావిడిగా మళ్లీ వెనక్కి వచ్చేయడం మనం గమనించాల్సిన విషయం. ఊహించని చర్యతో మోదీని థ్రిల్‍ చేసి – ఆయన తేరుకునేలోపే క్విక్‍ కా తప్పుకుందామన్న ఆలోచనతో రాహుల్‌ స్పీడుగా లేచి వచ్చేసినట్టు కనిపించింది. అయితే మోదీ ఇంతలోనే తేరుకుని రాహుల్‍ ని వెనక్కి పిలిచి భుజం తట్టి పెద్దరికం చూపించి తనదే పైచేయి అన్నట్టు సీన్‍ ఎండ్‍ చేశారు. దాంట్లో మోదీ సమయస్ఫూర్తి స్పష్టంగా కనిపిస్తుంది. షాక్‌ తిన్నా రాహుల్‌ వెళ్లే లోపే తేరుకుని వెనక్కి పిలవడం మోదీ చాతుర్యానికి తార్కాణం.

తరవాత తన పక్కవాళ్లతో మాట్లాడుతూ రాహుల్‍ కన్నుకొట్టారు. ( రాహుల్‍ గారు ప్రియావారియర్‍ కి పోటీ వచ్చినట్టు ఆ విషయం నెట్‍లో వరైరల్‍ అయిపోవడం మొదలయిందనుకోండి. అది వేరే సంగతి. ) చూశారా… పెద్దాయన ఊహించని విధంగా భలే తమాషా చేశా! – అన్న భావం ఆ కళ్లలో కనిపించింది.

ఇంతకీ రాహుల్‍ మెచ్యూరిటీ ప్రదర్శించాడా? లేక దీన్ని కుర్రతన్నం చేష్టగానే తీసుకోవాలా? అన్నదిప్పుడు ఓ క్వశ్చన్‌గా మారింది. తనని పప్పు అని పిలిచినా దేశం కోసం భరిస్తాను – లాంటి డైలాగులు చెప్పడం నిజంగా తన మెచ్యూర్డ్‍ – అని చూపే ప్రయత్నమే. అయితే చూశావా మోదీని ఎలా కన్ఫ్యూజ్‍ చేశానో బిత్తరపోయేలా చేశానో – అన్నట్టు కన్నుకొట్టడం మాత్రం కుర్రతనపు చేష్ట గానే అనిపిస్తుంది. నిజంగానే మోదీని తన చేష్టతో బిత్తరపోయేలా చేసిన రాహుల్, ఆ విజయగర్వాన్ని దాచుకోలేక కన్నుకొట్టి – మళ్లీ మోదీ నోట విమర్శల పాలవడం విశేషం.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu