కొత్త కస్టమర్‌గా మారితే కోటి లాభాలు!

F2 Movie

టెలికాం సర్వీసుల్లో ఎక్కడైనా గమనించండి! ఆల్రెడీ మీరు వాళ్లకి కస్టమర్‌ అయితే మీరు ఎక్కువ బిల్‌ పే చేయాల్సి వస్తుంది. అదే… కొత్త కస్టమర్‌గా చేరారనుకోండి.. తక్కువ రేట్లంటారు. డేటా ఎక్కువ ఇస్తారు. ఫ్రీ వైఫై రూటర్‌ లాంటివన్నీ ఆఫర్‌ చేస్తారు. కానీ ఇవన్నీ కొత్తగా కస్టమర్‌గా చేరతామన్న వాళ్లకు మాత్రమే! ఎస్‌. ఫోన్‌ కంపెనీలన్నీ ఆఫర్లన్నీ కొత్తవాళ్లకే ఇస్తున్నాయి. ఒక్కసారిగా కస్టమర్‌గా మారాక పెద్దగా వాల్యూ ఉండదు. ఇదే ఇప్పుడు నడుస్తున్న తంతు! దీనికి పరిష్కారం ఏమిటి? అదే చదవండి. నలుగురికీ చెప్పండి!

మీరు ఆల్‌రెడీ దేనికి కస్టమర్‌ అయ్యారో ఆ కంపెనీవాళ్లకి సంబంధించిన యాడ్స్‌ గమనిస్తూ ఉండండి. కొత్త వాళ్లని ఆకర్షిస్తూ వాళ్లు రకరకాల ప్యాకేజీలు ఇస్తూ ఉంటారు. మిమ్మల్ని ఆకర్షించే ఓ మంచి ఆఫర్‌ కనిపించినప్పుడు – మీ ఫోన్‌ సర్వీసుకి కాల్‌ చేసి – నాకు ఆ ఆఫర్‌ని మీకు కూడా వర్తింపజేయమని అడగండి. ఎందుకంటే – ఒక కంపెనీ ఒక మంచి సర్వీస్‌ అందించగలుగుతున్నప్పుడు – అప్పటివరకూ సంస్థతో సంబంధంలేని కొత్త కస్టమర్ల కంటే – అప్పటికే విధేయంగా ఉన్న మీరే అది పొందడానికి అర్హులు. ఇది కాదనలేని సత్యం! అయితే వాళ్లు వెంటనే ఒప్పుకోరు. ఆ కొత్త ఆఫర్‌ కొత్త కస్టమర్లకే గానీ … పాతబడిపోయిన మీకోసం కాదని అంటారు. దాని వెనక వాళ్ల ఉద్దేశం ఏంటంటే – ఇప్పటికే మీరు వాళ్ల సర్వీసు తీసుకుని కస్టమర్‌ అయిపోయారు. అంటే వాళ్లకి లొంగిపోయారు. కాబట్టి మీకు పెద్దగా విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు – అని! పైకి చెప్పకపోయినా వాళ్ల భావం అదే! కస్టమర్‌గా మారి అలుసైపోయారు కాబట్టి – వాళ్ల బుట్టలో పడిపోయిన మీకు ఏ కొత్త ఆఫరూ ఉండదు. కొత్తవాళ్లకే అన్ని ఆఫర్లూ ఉంటాయని వాళ్లు కన్ఫర్మ్‌ చేసి చెబుతారు. మరి ఏంటి దీనికి పరిష్కారం? దీనికి పరిష్కారం ఒక్కటే! వెంటనే మీరు మీ ఫోన్‌ కనెక్షన్‌ క్లోజ్‌ చేసేయమని చెప్పండి. అదేంటని వాళ్లు అడగ్గానే – “నేను వేరే ఫోన్‌ తీసుకోను. మీతోనే ఉంటాను. కానీ పాత అకౌంట్‌ క్లోజ్‌ చేసేసి- మీ దగ్గరే కొత్త కస్టమర్‌గా జాయిన్‌ అవుతాను” అని చెప్పండి. అదేంటని అడిగితే – “మీరు కొత్త కస్టమర్లకే విలువ ఇస్తారు, పాత కస్టమర్ల లాయల్టీ ( విధేయత) కి మీ దగ్గర విలువ లేదు కాబట్టి తిరిగి కొత్తగా జాయినవుతాను ” చెప్పండి. “మేం పాత కస్టమర్లకి కూడా విలువ ఇస్తాం” అని వాళ్లు బుకాయిస్తారు. అయితే లాయల్టీకి విలువ అనేది ఉంటే – కొత్త వాళ్లకి ఇస్తున్న బెనిఫిట్స్‌ మీకు కూడా ఇమ్మని నిర్మొహమాటంగా అడగండి. తప్పకుండా ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే వెంటనే గుడ్‌ బై చెప్పండి. అందులోనే మరోసారి కొత్తగా చేరి కొత్త బెనిఫిట్స్‌ పొందండి. ఫోన్‌ నంబర్‌ మారకూడదూ అనుకుంటే పోర్ట్‌ ఆప్షన్‌తో మరో కంపెనీ సర్వీసులకి వెళ్లిపోండి. అక్కడ మీరు కొత్తవాళ్లు కాబట్టి కొత్త ఆఫర్లు తప్పకుండా స్వాగతం చెబుతాయి.

పాత అకౌంట్‌ని వదిలేసి కొత్త కనెక్షన్‌తో కొత్త కస్టమర్‌గా చేరడం తప్పేమీ కాదు. చట్టవిరుద్ధమూ కాదు. విదేశాల్లో భార్యకు విడాకులిచ్చేసి మళ్లీ అదే ఆమెను పెళ్లి చేసుకునే వ్యక్తుల కథలు ఎన్నో ఉన్నాయి. రెండో సారి కలిసినప్పుడు వాళ్ల బంధం గట్టిగా ఉండడం చూస్తుంటాం. ఇదీ అలాంటిదే అనుకుని పాత అకౌంట్లు వదిలేయండి. కొత్త కస్టమర్‌గా చేరండి, కొత్త కస్టమర్లకి వచ్చే అన్ని బెనిఫిట్సూ పొందండి!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu