కలవరపెట్టి కవర్‌ పేజీలకెక్కుతున్న శ్రీరెడ్డి!

F2 Movie

తెలుగు సినిమా, తమిళ సినిమా చాలా క్లోజ్‍గా ఉంటాయి. హీరోల విషయంలో అభిరుచి కొంత వేరు. మనం తమిళ హీరో సూర్యని అంగీకరిస్తాం. కానీ విజయ్‌ని ఆదరించం. అయినా హీరోయిన్ల విషయంలో మాత్రం – తెలుగు, తమిళ ప్రేక్షకుల అభిరుచి ఎక్కువగానే కలుస్తుంది. అందువల్ల – పాతకాలంనుంచీ కూడా – ఇక్కడా అక్కడా కామన్‍ హీరోయిన్లు కొందరు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటారు. ఈ కారణంగానే – తెలుగు సినిమా మేగజైన్స్‌ మీద కనిపించే హీరోయిన్సే తమిళ పత్రికల పైనా కనిపించడం మామూలు. అయితే తెలుగులో హీరోయిన్‍ స్థాయి లేని ఒక అమ్మాయి తమిళ మేగజైన్‍ కవర్‍ పేజీలకి ఎక్కడం మాత్రం ఇదే ప్రథమం. దీన్ని శ్రీరెడ్డి సాధించింది.

“ఇదుగో ఈ హీరో ఇలా ప్రవర్తించాడు, ఆ డైరెక్టర్‍ అలా ఎక్స్‌ప్లాయిట్‌ చేశాడు” అంటూ ఆరోపణలు చేసి అతి కొద్ది కాలంలోనే పాపులర్‍ అయిపోయింది శ్రీరెడ్డి. ” ఇలాంటివాటికి ప్రూఫులెలా ఉంటాయి?… కెమెరా ఎక్కడ పెట్టమంటారు? ” అంటూ – తన స్టయిల్లో అభ్యంతరకరమైన మాటలు విసరడంతో – తన ఆరోపణల్లో నిజమెంతో అబద్ధమెంతో నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండానే – ఆమెకు పాపులారిటీ పెరిగిపోయింది.

ఇంతకాలం తెలుగు సినిమానే ఇరుకులో పెట్టిన శ్రీరెడ్డి – ఈమధ్య తమిళ సినిమారంగం మీద ఆరోపణలు మొదలుపెట్టింది. తమిళం రాకపోయినా, వచ్చీరాని ఇంగ్లిష్‌ తోనే అక్కడి యూట్యూబ్‌ ఛానెల్స్‌లో ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలెట్టింది. దాంతో తమిళ సినిమా పత్రికలన్నీ శ్రీరెడ్డి గురించి రాయడం మొదలుపెట్టాయి. కవర్‌పేజీల మీద కవర్‌ చేయడం మొదలెట్టాయి. సినిమా పత్రికలతో పాటు రాజకీయ పత్రికలూ ఆమెకి కవర్‌ పేజ్‌ లో స్థానం ఇవ్వడం విశేషం. కన్నడ హీరో రాజ్‌కుమార్‌ని వీరప్పన్‌ కిడ్నాప్‌ చేసినప్పుడు పాపులర్‌ అయిన ‘నక్కీరన్‌’ తమిళ పత్రిక కూడా ఇటీవల శ్రీరెడ్డిని కవర్‌ పేజ్‌ గా వేసింది.

ఇక్కడ – తెలుగు సినిమా పెద్దలకి శ్రీరెడ్డి మీద పీకలమీదా కోపం ఉండే ఉంటుంది. ఎప్పుడూ సినిమావాళ్లకి వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా రాయడం ఎరగని మన భజన పత్రికలు కొన్ని – శ్రీరెడ్డిని ఎలాగూ ఎలివేట్‍ చేయవు, ఏనాటికీ ఆమె ముఖాన్ని కవర్‍ పేజీగా వేయవు – అన్నది తెలిసిన విషయమే! పోన్లెండి. కనీసం ఈ విధంగానైనా కవర్‍ పేజ్‍ గర్ల్‌ గా కనిపిస్తున్నందుకు శ్రీరెడ్డి హ్యాపీగా ఫీలవుతోందనుకోవచ్చు!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu