ఒకే షాట్ లో రెండు గంటల మలయాళ చిత్రం!

PremaLekhalu
Two-Hour Film.. In A Single Shot!

దర్శకుడు మేధావి అయితే .. ఎన్ని ప్రయోగాలైనా చెయ్యచ్చు. సాధారణంగా అలాంటి ప్రయోగాలు మన సౌత్ స్క్రీన్‌ మీదే ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా మలయాళ తెరమీద చేస్తున్న ఈ ప్రయోగం గురించే అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలాంటిలాంటి ప్రయోగం కాదు మరి! రెండు గంటల ప్రదర్శన సమయం కలిగిన సినిమాను ఒకే ఒక్క షాట్ లో చిత్రీకరించడం అంటే సామాన్యమైన విషయం కాదు.
ఈ ప్రయోగంతో తీస్తున్న సినిమా పేరు ‘విప్లవం జయిక్కానుళ్లదాన్’.
త్రిస్సూర్ జిల్లాలోని చియారం వాసి అయిన నియాస్ హసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ఏకషాట్ మూవీలో ఆరు పాటలు, మూడు ఫైట్స్ , రెండు ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా ఉండడం విశేషం! అంతేకాదండోయ్ .. ఈ సినిమాలో అరవై ప్రధాన పాత్రలున్నాయి. వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్ట్ లు కూడా నటిస్తున్నారు. ఇంకా .. ఈ సినిమాతో ఉమేష్ ఉదయకుమార్, సాందర్ జాన్సన్ హీరో, హీరోయిన్స్ గా పరిచయం అవుతున్నారు. అయినా మరీ ఒక్క షాట్ లో సినిమా మొత్తం ఎలా తీశారు? అలా తీసేస్తే క్వాలిటీ వస్తుందా? ఇలాంటి సందేహాలన్నీ తీరాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే! సినిమా రిలీజయ్యాక చూడాల్సిందే!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu