ఏ కవర్‌ పేజ్‌ చూసినా ఆ అమ్మాయే!

F2 Movie

దిలీప్‌ కుమార్‌ మనవరాలి ఇమేజ్‌తో, మెరిసిపోయే లుక్‌ తో 2015 లో తెరంగేట్రం చేసింది సాయేషా సైగల్‌. ‘అఖిల్‌’ సినిమాతో హిట్‌ అందుకోలేకపోయినా సాయేషా అందానికీ, క్రేజ్‌ కీ లోటేమీ రాలేదు. 2016 లో హిందీలో ‘శివాయ్‌’ అనే సినిమా చేసింది. అదీ హిట్టేం కాదు, బ్రేకూ రాలేదు. అయితే ఇప్పుడు సాయేషాకి తమిళ సినిమా ఛాన్సులు విపరీతంగా వస్తున్నాయి. గత ఏడాది వనమగన్‌ అనే సినిమా చేసింది. ఈ ఏడాది కడైక్కుట్టి సింగమ్‌ ( తెలుగులో కార్తి ‘చినబాబు’ ), జుంగా – ఇంకా మరికొన్ని సినిమాలు చేస్తోంది. అయితే అదిరిపోయే రంగు వల్లో ఆకర్షించే అందం వల్లో తెలియదుగానీ – స్టార్‌ హీరోయిన్‌ కాకపోయినా ఈ మధ్య తమిళ పత్రికల కవర్‌ పేజీలన్నీ సాయేషాతో నిండిపోతున్నాయి. వణ్ణత్తిరై, కుంగుమమ్‌, తోళి … ఇలా పత్రికల బ్యాక్‌ కవర్లూ ఫ్రంట్‌ కవర్లూ అన్నిటినీ ఈ మధ్య సాయేషా కవర్‌ చేసేసింది. ఇప్పుడు ఈ సాయేషా కవర్‌ క్రేజ్‌ కన్నడ పత్రికలకీ పాకినట్టుంది. జూలైలో ‘నిమ్మెల్లర మానస’ అనే కన్నడ పత్రిక సాయేషా ముఖచిత్రంతో అదరగొట్టింది. ఎవరికైనా ఓ సీజన్‌ రావాలి. వస్తే ఇలాగే ఉంటుంది మరి!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu