‘ఏడు’లో మూడు రూపాలు

F2 Movie

‘బాహుబలి’ విజయం తరవాత సినిమాలోని ఒక్కో కారెక్టర్నీ పరిచయం చేసుకుంటూ సినిమా మీద హైప్‌ పెంచడం ఓ అలవాటుగా మారింది. నిన్నటి గూఢచారి నుంచి నేటి ఎన్టీఆర్‌ మూవీ వరకూ ఇదే టెక్నిక్‌ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు తాజాగా ‘సెవెన్‌’ మూవీ కోసం ఇదే పద్ధతి ప్రారంభించారు ప్రమోటర్లు. శివగామిగా రమ్యకృష్ణ, దేవసేనగా అనుష్క, అవంతికగా తమన్నా – అన్న తరహాలోనే జెన్నీ, రమ్య, ప్రియ అనే కారెక్టర్లని పరిచయం చేస్తూ ప్రమోషన్లు మొదలుపెట్టారు. స్టిల్స్‌ రిలీజ్‌ చేశారు. జెన్నీగా అనిషా ఆంబ్రోస్‌, రమ్యగా నందితా శ్వేత, ప్రియగా త్రిధా చౌధరిని చూపించే స్టిల్స్‌ మూడూ ఒకే మూడ్‌లో ఉండడం విశేషం. ఈ మూడింటిలో అనిషా స్టిల్‌ పూర్తిగా మిస్‌ యూనివర్స్‌ సుస్మితా సేన్‌ని తలపించడం మరో విశేషం. ఇంతవరకూ పెద్దగా గుర్తింపు పొందని ఈ ముగ్గురు అమ్మాయిలూ ఈ సినిమా తరవాతయినా క్రేజ్‌ సంపాదించుకుంటారేమో చూడాలి.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu