ఏఎన్నార్ సినిమా టైటిల్ తో వస్తున్న నాగార్జున, నాని..!

PremaLekhalu

అక్కినేని నాగార్జున, నాని కలిసి ఒక చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈ సినిమాకి ‘దేవదాస్’ అనే టైటిల్ ని ఖరారు చేసింది చిత్ర యూనిట్. ఇందులో నాగార్జున దేవ అనే డాన్ పాత్ర చేస్తుండగా , నాని దాస్ అనే డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సారథి స్టూడియోస్ లో శరవేగంగా జరుగుతోంది. వైజయంతి బ్యానర్ మీద అశ్వినిదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్, రష్మీక మందన్నా హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 13 న వినాయక చవితి కానుకగా రిలీజ్ చేయనున్నారు.


PremaLekhalu