ఏం సాధించలేకపోయిన కన్నడ మెహబూబా

F2 Movie

దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్‌ హీరోగా వచ్చిన ‘మెహబూబా’ సినిమా గుర్తుంది కదా… అందులో పాకిస్థానీ గాళ్‌ పాత్రలో నటించిన మంగళూరు భామ నేహా శెట్టి కూడా మీకు గుర్తుండే ఉంటుంది. ఆమె గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం… ముంగారు మళె2 చిత్రంతో శాండల్‌వుడ్‌లో శభాష్ అనిపించుకున్న ఈ హీరోయిన్ నేహా శెట్టి భవిష్యత్తులో పెద్ద సెన్సేషన్ అవడం ఖాయమని అప్పట్లో దాదాపు అందరూ అనుకున్నారు. కానీ, అదేమి జరగలేదు.
ముంగారు మళె2 సినిమా తర్వాత చందన్ శెట్టి తీసిన చాక్లెట్ గాళ్ అనే వీడియో ఆల్బంలో కనిపించడం తప్ప మరే సినిమాలోనూ నేహ నటించలేదు. తర్వాత ఒకట్రెండు సినిమాల్లో ఆమె నటించనుందని వార్తలు వచ్చాయి గానీ, ఆ సినిమాలేవీ సెట్స్‌కి వెళ్ళనే లేదు. ఆ పరిస్థితుల్లో నేహకు ఛాన్స్ ఇచ్చింది పూరీయే. ఆ తర్వాత మళ్ళీ నేహకు ఛాన్స్‌లేవీ రాలేదు. నేహకు బ్రేక్ ఎప్పుడొస్తుందో మరి…

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu