ఎన్టీఆర్‌ పరువు తీసే స్టిల్స్‌ అవసరమా?

SriRamaNavami

సినిమా దగ్గరపడే కొద్దీ – ఒక్కో పోస్టర్‌ రిలీజ్‌ చేస్తుంటారు నిర్మాతలు. ఎన్టీఆర్‌ మూవీ కోసం వాళ్లిప్పుడు ఓ సాంగ్ సిట్యుయేషన్‌ ఉన్న స్టిల్‌తో పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఈ స్టిల్‌ ‘యమగోల’ సినిమా లోని ‘చిలకకొట్టుడు కొడితే..’ అనే పాటకి సంబంధించింది. ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే – ఈ పాటలోనే కాదు, యమగోలలోని ‘ఓలమ్మీ తిక్క రేగిందా?’ లాంటి పాటల్లో కూడా ఎన్టీఆర్‌ జయప్రద మీది కాలువేస్తాడు. ఒక విధంగా కాలితో తన్నుతాడు. ఇలాంటివి సగటు ప్రేక్షకుడికి చాలా ఇబ్బందిగా ఉంటాయి. హీరో అనేవాడు హీరోయిన్‌తో సున్నితంగా ప్రవర్తించాలి. కానీ మరీ కాలు మీద కాలు వేయడం, తన్నడం ఏమిటని అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. ఎన్టీఆర్‌ ఎంత గొప్ప నటుడైనా, మహానటుడని అనిపించుకున్నా – కెరీర్‌ చివర్లో చేసిన సినిమాల్లో ఆయన ఓవరాక్షన్ చేశాడన్న విమర్శ ఊపందుకుందన్నది సత్యం. పాత పౌరాణిక చిత్రాల్లో ఎన్టీఆర్‌ తిరుగులేని పాత్రలు ఇప్పటికీ ఆదరణ పొందుతున్నప్పటికీ – తరవాత 70, 80 లలో వచ్చిన సినిమాల్లోనిఎన్టీఆర్‌ నటనని ఇప్పటితరంవారు ఓవర్‌ యాక్షన్‌ గా విమర్శించడాన్ని మనం గమనించవచ్చు. యమగోల ఎంతో హిట్ సినిమా. అయినా అందులో ఎన్టీఆర్‌ నటన ఈ తరంవారికి కాస్త అతిగానే అనిపిస్తుంది. ముఖ్యంగా – పాటలో హీరోయిన్‌ని కాలెత్తి తన్నడం లాంటివి! ఎన్టీఆర్‌ ఏం చేసినా అద్బుతమే! – అని పాతతరం వారూ, ఆయన వీరాభిమానులూ అనుకోవచ్చు, ఇతరులూ అలాగే అనాలని అనుకోవచ్చు. కానీ వ్యక్తిపూజని పక్కన పెట్టి – నిజాన్ని మాత్రమే కచ్చితంగా స్కాన్ చేస్తున్న ఈ తరం – అలా అనుకోకపోవచ్చు. కాబట్టి- ఎన్టీఆర్‌లోని గొప్పతనాన్ని మాత్రమే చూపే లక్ష్యంతో  రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్‌కోసం – ఆనాడే విమర్శలందుకున్న ఇలాంటి ఓవర్‌ యాక్షన్‌ స్టిల్స్‌ ఇవ్వడం కరెక్టేనా? అని నిర్మాతలూ దర్శకుడూ ఆలోచించుకోవాలి.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu