ఈ వారంలో మీరు ఈజీగా ఎగరచ్చు!

F2 Movie

అవును. ఇప్పుడు విమాన ప్రయాణాల రేట్లు రోజురోజుకీ తగ్గుతున్నాయి. మరీ ఎంతగా అంటే- సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేంత! ఎయిర్‌ ఏసియా ఈ వారంలో కేవలం పద్నాలుగు వందల తొంభైతొమ్మిది రూపాయలకే విమాన ప్రయాణం అందిస్తోంది. దేశంలో ఒకచోటినుంచి మరోచోటికి వెళ్లడానికి అయితే రూ.1499, అదే అంతర్జాతీయంగా విదేశాలకి ప్రయాణం చేయాలంటే కనీస ఛార్జ్‌ రూ.3.999 గా నిర్ణయించింది. అయితే ఈ ఆఫర్‌ – మీరు ఫిబ్రవరి 5 వ తారీకు నుంచి ఫిబ్రవరి 11 వ తారీకు లోపు బుక్‌ చేసుకుంటేనే! అయితే ఈ కండిషన్‌ మీరు టికెట్‌ బుక్‌ చేసుకునేవరకే! టికెట్‌ కొనుక్కున్న వెంటనే ఇప్పుడే ప్రయాణం చేసేయాలని రూల్‌ ఏమీ లేదు. మీరు ఫిబ్రవరి 5 నుంచి జూలై నెల ముగిసే లోపు – ఎప్పుడైనా మీ ట్రావెల్‌ ప్లాన్‌ చేసుకోవచ్చు. బాగుంది కదూ?
విమానయాన సంస్థల మధ్య పోటీ పెరిగిపోవడం వల్ల – వివిధ సంస్థల టికెట్‌ రేట్లు ఈ మధ్య ఆకాశం నించి బాగా కిందికి దిగి వస్తున్నాయి. “విమాన ప్రయాణాలనేవి – టైమ్‌ మేనేజ్‌మెంట్‌ సంక్లిష్టంగా ఉండే బిజీ బిజినెస్‌ వ్యక్తులకే తప్ప సామాన్యుడికి ఎందుకు? సామాన్యుడికి సుఖాలు అలవాటు చేసి – వాడి దగ్గరున్న నాలుగు డబ్బులూ లాక్కోవడానికే ఈ ఎత్తుగడ” అని విమర్శించేవాళ్లూ ఉన్నారు. అయితే సరదాగా విమానం ఎక్కాలనుకునే సామాన్యులకి ఈ డిస్కౌంట్‌ రేట్లు ఆనందకరమే కదా? సో .. మిడిల్‌క్లాస్‌ జనాలూ… ఈ వేసవికి సరదాగా ఓ చిన్న విమాన ప్రయాణం ప్లాన్‌ చేసుకోండి!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu