ఇంటర్‌నెట్‌ రక్షకులొస్తున్నారు!

F2 Movie

అవును. మీకోసం ఇంటర్‌నెట్‌ రక్షకులొస్తున్నారు! ఇంటర్‌నెట్‌ని రక్షించడానికి కాదు! మిమ్మల్ని ఇంటర్‌నెట్‌ నుంచి రక్షించడానికి!
కంప్యూటర్లలో దూరిపోవడం, మొబైల్‌ స్క్రీన్‌లో ముఖం దాచేసుకుని పక్కనున్న మనుషుల్ని పలకరించకపోవడం… ఇవీ నేటి ట్రెండ్స్‌! టెక్నాలజీ అన్నది ఓ ఎడిక్షన్‌గా మారిపోయింది. ఇది ఎంత ప్రమాదకరంగా మారిందంటే – మొత్తం సమాజం, సంఘజీవి అన్న పదాలకే అర్థాలు మారిపోయేంత ఘోరమైన పరిస్థితి. ఎవరి ఫోనుల్లో ఎవరి ప్రైవేటు జీవితాల్లో వాళ్లు బిజీ అయిపోయి పక్క మనుషుల్ని కనీసం పలకరించడానికి కూడా టైమ్‌లేని వింత సమాజం రూపుదిద్దుకుంటోందని సామాజిక శాస్త్రవేత్తలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్లకి – టెక్నోజనం కూడా తోడవడం విశేషం. ఫేస్‌బుక్‌, గూగుల్‌, యాపిల్‌ లాంటి ప్రముఖ టెక్నాలజీ సంస్థల్లో గతంలో పనిచేసిన కొందరు వ్యక్తులు సీహెచ్‌టీ ( సెంటర్‌ ఫర్‌ హ్యుమేన్‌ టెక్నాలజీ – Center for Humane Technology) అనే సంస్థని ఏర్పరచారు.

హ్యుమేన్‌టెక్‌ (humanetech.com)పేరుతో ఒక వెబ్‌సైట్‌ కూడా మొదలుపెట్టారు. మానవజాతి అసలైన లక్ష్యాలు, జీవన మాధుర్యం లాంటివన్నీ టెక్నాలజీ ఎడిక్షన్‌ కారణంగా నాశనం కాకూడదన్నదే ఈ సంస్థ లక్ష్యం. ఆసక్తిని ఆపుకోలేని జనం – ఫేస్‌బుక్‌లో పోచికోలు కబుర్లు, గూగుల్‌ ప్లేస్టోర్‌లో అర్థం లేని యాప్‌లతో – ఆన్‌లైన్లోనే సగం జీవితాలు గడిపేస్తున్నారు. ఆన్‌లైన్‌ మీడియా సంస్థలు ఈ యూజర్ల ఆసక్తిని తమ కమర్షియల్‌ అవసరాల కోసం చక్కగా ఉపయోగించుకుంటున్నాయి. అయితే మానవజాతికి ఉపయోగపడే విధంగా ఈ సంస్థలు తమ రూపు మార్చుకోవాలని సిహెచ్‌టీ వాళ్లు డిమాండ్‌ చేస్తున్నారు.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu