ఆ హీరో జయంతిని ప్రభుత్వమే నిర్వహిస్తుంది

PremaLekhalu
Government Celebrates Sivaji-Ganesan Hero's Birthday Every Year

ఒక సినిమా హీరో జయంతి కార్యక్రమాన్ని స్వయంగా ప్రభుత్వమే నిర్వహించనుంది. ఆ హీరో ఎవరంటే… ‘నాకంటే ముందు ఆయనకు దాదాఫాల్కే అవార్డ్ వస్తే సంతోషించేవాడిని’ అని నటసమ్రాట్ అక్కినేని సైతం గొప్పగా చెప్పుకున్న తన స్నేహితుడు శివాజీ గణేశన్. వాచిక, అభినయాల్లో అగ్రశ్రేణి నటునిగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన మన దక్షిణాది నటధీరుడు, తమిళతెరకు ప్రాణం పోసిన శివాజీ గణేశన్ జన్మదినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని తమిళనాడు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ ప్రకటనపై శివాజీ కుమారుడు, ప్రముఖ హీరో అయిన ప్రభు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూనే మరో కోరిక కోరారు. తన తండ్రి విగ్రహాన్ని చెన్నైలోని మెరీనా బీచ్ తీరాన ఏర్పాటు చేస్తే ఇంకా ఆనందిస్తానన్నారు. ఇందుకోసం ప్రభుత్వాన్ని సంప్రదిస్తానని తెలిపారు.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu