ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ తో ఈజీగా భాషలు!

F2 Movie

ఇప్పుడు ప్రపంచం గ్లోబల్ విలేజ్ గా మారిపోతున్న నేపథ్యంలో అందరూ దేశాల సరిహద్దులుదాటి ఒకరితో ఒకరు కాంటాక్ట్స్ ఏర్పరచుకుంటున్నారు. ఎక్కడో ఉండే వ్యక్తులతో కూడా ఈజీ గా అందుబాటులో ఉండగలిగే అవకాశాన్ని ఇప్పుడు సోషల్ ప్లాట్ ఫార్మ్స్ కల్పిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇప్పటికీ భాష అనేది ఒక అడ్డుగోడగానే మనుషుల మధ్య మిగిలిపోతోంది. అందుకే కొందరు కొత్త భాషల్ని నేర్చుకునే అవకాశాలకోసం ఇదివరకటి కంటే ఎక్కువగా అన్వేషిస్తున్నారు. పొరుగున ఉన్న భాష నేర్చుకోవటమే కొంతమందికి చాలా కష్టం. అలాంటిది ఒక విదేశీ భాష నేర్చుకోవటమంటే ఒక భయం, బెరుకూ ఉండడం సహజం. అయితే ఈ బెరుకును పోగొట్టి సులువుగా పరాయి భాషను నేర్పగలం అంటూ కొన్ని సాఫ్ట్ వేర్లు ముందుకొస్తున్నాయి ROSETTASTONE , PIMSLEUR, ROCKET LANGUAGE LEARNING లాంటివి భాషలు నేర్పే రంగంలో ఏనాటినుంచో టాప్ లో ఉన్నాయ్. ఈ మధ్య మొబైల్ విప్లవం వచ్చిన తరవాత Duolingo అనే ఒక APP జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు దాని రూపకర్తలు దాన్ని ప్రమోట్ చేసేందుకు కొత్తగా ‘ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్’ అనే మాటని ముందుకు తీసుకొస్తున్నారు. “మీరు అతి సులువుగా బెరుకు లేకుండా భాష నేర్చుకోవాలంటే మా App ని యూజ్‌ చేయండి. ఎందుకంటే దీనిలో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ద్వారా ఇది రూపొందింది” అంటూ వాళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. చూద్దాం, వీళ్ల ప్రమోషన్‌ ఫలించి ఈ యాప్‌ యూసేజ్‌ ఎంతవరకూ పెరుగుతుందో!

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu