అల్లుడు శీను కి కాజల్ ఓకే చెబుతుందా..?

వి.వి.వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన ‘అల్లుడు శీను’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు బెల్లంకొండ శ్రీనివాస్. ‘జయ జానకి నాయక’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీను ప్రస్తుతం ‘సాక్ష్యం’ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. తాజాగా ఆయన తన తదుపరి సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డెబ్యూ డైరెక్టర్ నాని దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు నాని కూడా స్టోరీ లైన్ కాజల్ కి చెప్పగా ఆమె కూడా నటించడానికి ఆసక్తి చూపుతోందని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఇంకా దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉండగా ఈ సినిమా ఏప్రిల్ రెండో వారంలో సెట్స్ మీదకు వెళ్ళనుంది.

This post is also available in: enఇంగ్లిష్‌