అర్జున్ రెడ్డి డైరెక్టర్ తో మహేష్ బాబు ‘షుగర్ ఫ్యాక్టరీ’

F2 Movie

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆయన తాజాగా హీరో మహేష్ బాబు కు ఒక కథ చెప్పినట్లు తెలుస్తోంది. దానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట. ఈ సినిమాకు ‘షుగర్ ఫ్యాక్టరీ’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట. దీనిని మహేష్ 26 వ చిత్రంగా తెరకెక్కిస్తారని సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ డైరెక్షన్ లో ‘భరత్ అను నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత డైరెక్టర్ వంశీ పైడిపల్లి తో తన 25 వ చిత్రం చేయనున్నాడు మహేష్ బాబు. ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu