అయ్యో! కంప్యూటర్లు ఎవరూ కొనట్లేదట!

SriRamaNavami

మొబైల్స్, టాబ్లెట్స్ ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చిన తరవాత చాలామందికి పర్సనల్ కంప్యూటర్ (PC ) అవసరం బాగా తగ్గిపోయింది. ఏదో గ్రాఫిక్స్ వర్క్స్, డీటీపీ వర్క్స్ చేసేవాళ్లకి తప్ప – మామూలు చిన్నచిన్న అవసరాలన్నిటికీ కంప్యూటర్లు ఉపయోగించాల్సిన పనే లేదిప్పుడు. బ్యాంకింగ్, షాపింగ్ లాంటి ఎన్నో పనులు మొబైల్ ద్వారానే అయిపోతున్నాయి. వీడియోలూ, సినిమాలూ చూడడానికి చిన్న స్క్రీన్ మొబైల్స్ ఉపయోగపడవని అనుకుంటే – టాబ్లెట్స్ ఆ లోటు తీర్చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఫోన్ కి టాబ్లెట్ కి మధ్య రకంగా అనిపించే ఫ్యాబ్లెట్స్‌ కూడా వచ్చాయి. 6 ఇంచెస్, 6.44 ఇంచెస్ ఉండే ఈ ఫోన్ టాబ్లెట్స్ కి స్క్రీన్ కూడా తగినంత పెద్దగా ఉండటం వల్ల – పీసీల అవసరాన్ని పూర్తిగా తగ్గించేస్తున్నాయ్. టాబ్లెట్ ఎప్పుడైతే జనంలో ప్రాచుర్యం పొందిందో లాప్‌టాప్‌ అవసరం కూడా పడిపోయింది. టాబ్లెట్ కే వైర్లెస్ గా కీబోర్డ్ ని మౌస్ ని జతచేసుకుని లాప్‌టాప్ గా వాడుకోగలిగిన అవకాశం ఉన్నపుడు – ప్రత్యేకంగా లాప్‌టాప్‌తో పనేముంటుంది? ఇలాంటి కారణాలవల్ల ప్రపంచ వ్యాప్తంగా పీసీ మార్కెట్ రానురాను డౌన్ అయిపోతూ వస్తుంది. డెస్క్‌టాప్ లతో పాటు లాప్‌టాప్ ల సేల్స్ కూడా విపరీతం గా పడిపోయాయి.
అయితే ఇక్కడ గుర్తించదగిన పరిణామం ఏమిటంటే పీసీలూ, ల్యాప్‌టాప్‌లూ తయారుచేసే పెద్ద పేరున్న బ్రాండెడ్ కంపెనీలు మాత్రం ఈ మొబైల్ వెల్లువలో కూడా – తమ పీసీ అమ్మకాల్ని కాస్త అటూ ఇటూగా స్థిరంగానే ఉంచుకోగలుగుతున్నాయట. కానీ చిన్న కంపెనీల పీసీల అమ్మకాలు మాత్రం విపరీతంగా పడిపోయాయి. ఉదాహరణకి HP LENOVO DELL APPLE ASUS ACER TOSHIBA – ఈ కంపెనీలన్నీ తమ పీసీ సేల్స్ ని దాదాపు ఇదివరకు ఎలా ఉన్నాయో అలాగే మేనేజ్ చేయగలుగుతున్నాయ్. కానీ బ్రాండెడ్‌ వాల్యూ పెద్దగా లేని ఊరూపేరూ లేని చిన్న చిన్న పీసీ తయారీకంపెనీల తాలూకు సేల్స్ మాత్రం దారుణం గా పడిపోయాయి. 2009 – 2018 వరకూ తీసుకుంటే – ఈ గ్రాఫ్ లో ఘోరమైన డ్రాప్ కనిపిస్తుంది.
ఇలా ఎందుకు జరుగుతోందీ అంటే – సాధారణంగానే పెద్ద కంపెనీలు తమ పీసీ రేట్స్‌ని ఒక స్థాయికంటే కిందికి ఎప్పుడూ దించవు. అందువల్ల బ్రాండెడ్ కంప్యూటర్ కావాలనుకునే వాళ్లూ, పెద్ద కంపెనీ వస్తువులే కొనాలనుకునే వాళ్లూ మాత్రమే వీటిని కొంటారు. బ్రాండెడ్‌ కంప్యూటర్ల స్థాయి ఖర్చుకు ముందుగానే ప్రిపేర్ అయినవాళ్లు మాత్రమే వాటి జోలికి పోతారు. అయితే ఇలాంటివాళ్ళు సంఖ్యలో చాలా తక్కువగా ఉంటారు. మిగిలినవాళ్లంతా అసెంబుల్డ్‌ కంప్యూటర్లనే ఉపయోగించడం పరిపాటి. బ్రాండెడ్‌ కంప్యూటర్లు కొనే కస్టమర్‌ బేస్‌ ఎప్పుడూ పరిమితంగా ఉంటుంది. అయినా బ్రాండ్ లాయల్టీ కలిగినవాళ్లూ ఆ వస్తువుల పట్ల స్థిరమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఎన్ని చిన్న చిన్న డివైజెస్‌ వచ్చినా – హై-ఎండ్‌ బ్రాండెడ్‌ పీసీల అవసరం మారదు. అందువల్ల పెద్ద పెద్ద పీసీ కంపెనీల అమ్మకాలు మాత్రం స్థిరంగానే ఉండడం జరుగుతోంది.
కంప్యూటర్‌ అనేది జనానికి పరిచయమై, అది ఒక క్రేజ్‌ గా ట్రెండ్‌ గా మారిపోయిన సమయంలో ఏ చిన్న కంపెనీ పీసీ అయినా జనం వెంటనే కొనేస్తారు. కానీ ఇప్పుడు మొబైల్‌, టాబ్లెట్‌ ల ట్రెండ్‌. ఈ ట్రెండ్‌ లో చిన్న కంపెనీల పీసీలు ఎవరూ కొనడానికి మొగ్గు చూపరు. కేవలం పీసీలు మాత్రమే అవసరమైన వాళ్లు – ఎంచి ఎంచి పెద్ద బ్రాండ్‌ ఇమేజ్‌ ఉన్నవాటిని మాత్రమే కొంటుంటారు. ప్రస్తుత పరిణామానికి ఇదే కారణమని మార్కెటింగ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎలాగైతేనేం – పెద్ద కంపెనీలు ఈ మొబైల్ వెల్లువని తట్టుకుని ఇంకా తమ పీసీల్ని సమర్ధవంతంగా అమ్ముకుంటున్నాయన్నమాట. వీటిలో లెనోవో (LENOVO ) అయితే గతంలోకంటే తన పీసీ అమ్మకాల్ని పెంచుకోవడం విచిత్రమైన విషయం.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu