అజిత్ సరసన ‘విక్రమ్ వేదా’ హీరోయిన్

F2 Movie

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ లేటెస్ట్ గా ‘వివేకం’ సినిమాతో హిట్ కొట్టాడు. దీనికి దర్శకుడు శివ. ఇప్పుడు మళ్ళీ ఆయన దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు అజిత్ కుమార్. ఈ సినిమాకి ‘విశ్వాసం’ అనే టైటిల్ ని దాదాపు ఖరారు చేసింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ‘విక్రమ్ వేదా’ సినిమా హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇంకా దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది.
ఏది ఏమైనా ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారంలో సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఇకపోతే స్టార్ హీరోయిన్లు అనుష్క, నయనతార పేర్లు కూడా ఈ సినిమా హీరోయిన్ కోసం పరిశీలన లో ఉన్నాయి.

This post is also available in: enఇంగ్లిష్‌


PremaLekhalu